రాజకీయాలు: బాలయ్య, పవన్ కళ్యాణ్ కలిస్తే..?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ గాలం వేస్తున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ స్థితిలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిస్తే రాజకీయం ఎలా ఉంటుందనే చర్చ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి దిగడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దానికితోడు, ప్రచారంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారంలో స్టార్ అట్రాక్షన్ కూడా.

పవన్ కళ్యాణ్‌ను తెలుగుదేశం పార్టీలోకి తేవడానికి బాలకృష్ణ కూడా గతంలో ప్రయత్నాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌తో బేరసారాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

If Pawan Kalyan joins with Balakrishna

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో దండిగా అభిమానులున్న హీరో. అభిమానాన్ని సంపాదించుకోవడంలో ఆయన మిగతా తెలుగు హీరోలందరికన్నా ముందున్నారు. దీంతో బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కలిస్తే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పవన్ కళ్యాణ్‌కు చెప్పాలంటే, బాలకృష్ణ కన్నా ఎక్కువ ఆదరణ ఉంది. ఇటీవల ఆయన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఏమైనా, పవన్ కళ్యాణ్ వస్తే తెలుగుదేశం పార్టీకి అందని దాక్ష పండు కూడా అంది వచ్చినట్లే లెక్క.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+