'మెగా' పవర్ కోసమా: పవన్ పార్టీ చిరు జిమ్మిక్కా!?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడతారనే వార్తల నేపథ్యంలో వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కొత్త పార్టీ విషయం జాతీయ మీడియాలోను ప్రధానంగా వస్తోంది. పవన్ కొత్త పార్టీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ట్రిక్ కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ గెలిస్తే, అధిష్టానం తనను పక్కన పెట్టకుండా ఉండేందుకు చిరు తన సోదరుడు పవన్‌తో కొత్త పార్టీ పెట్టించి, 'మెగా' పవర్‌ను ఢిల్లీ పెద్దలకు చూపించేందుకేననే వాదనలు కొత్తగా తెర పైకి వస్తున్నాయి. పవన్ కొత్త పార్టీ పైన చిరంజీవి ఇప్పటి వరకు స్పందించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే, పవన్ పార్టీ వెనుక చిరు ఉన్నారనే విషయాన్ని చాలామంది కొట్టి పారేస్తున్నారు. వారిద్దరు మధ్య విభేదాలు చాలాకాలంగా ఉన్నాయని, ఇటీవల జరిగిన పలు వేడుకల్లో అది కనిపించిందని, అలాంటప్పుడు పవన్ వెనుక చిరు ఉన్నారనేది నమ్మకశ్యంగా లేదని అంటున్నారు.

కాగా, పవన్ తన పార్టీ పేరుకి యువరాజ్యం, పవన్ రిపబ్లికన్ తదితర పేర్లను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్ వెనుక సోదరుడు నాగబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారు.

హాల్ బుక్

హాల్ బుక్

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైందనే విషయాన్ని ధ్రువీకరిస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్ కళ్యాణ్ పేర ఓ హాల్ బుక్కయినట్లు సమాచారం.

హైటెక్స్ వేదికగా..

హైటెక్స్ వేదికగా..

హైటెక్స్ వేదికగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ తాను స్థాపించబోయే పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హైటెక్స్‌కు రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది.

45 నిమిషాలు...

45 నిమిషాలు...

సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం జరుగుతుంది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి.

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

ఆ తర్వాత తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్త హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

నాగబాబు మద్దతు ఉందా?

నాగబాబు మద్దతు ఉందా?

పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రానికి సోదరుడు, సినీ నటుడు నాగబాబు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. తెర వెనక వ్యహారమంతా సినీ దర్శకుడు త్రివిక్రమ్ చూస్తున్నట్లు వినికిడి.

నేరుగానా?

నేరుగానా?

పవన్ కళ్యాణ్ నేరుగా పార్టీ పేరును ప్రకటిస్తారా, స్వతంత్రంగా అభ్యర్థులను రంగంలోకి దింపి తాను దిగుతారా అనేది స్పష్టం కావడం లేదు. మొదటి పథకం ప్రకారమైతే, స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపి, రాజకీయాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, తాను పోటీకి దించినవారి వ్యవహార శైలి చూసిన తర్వాత పార్టీ పేరును ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం.

స్వంతంత్రంగా

స్వంతంత్రంగా

రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపి, మూడేళ్ల తర్వాత రాజకీయ పార్టీని స్థాపించాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది.

పవర్ స్టార్

పవర్ స్టార్

ప్రస్తుతం ఆయన వ్యూహం ఏమైనా మారిందా అనేది తెలియదు. నేరుగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగకూడదని కూడా ఆయన అనుకుంటున్నారు.

ఎక్కడి నుండి?

ఎక్కడి నుండి?

తాను మల్కాజిగిరి నుంచి లేదా అనకాపల్లి లేదా కాకినాడ నుంచి లోకసభకు పోటీ చేసి, 25 మందిని శాసనసభ బరిలోకి దింపుతారని భావించారు. కానీ, ఇప్పుడు అది మారినట్లు తెలుస్తోంది. 9 లోకసభ స్థానాలకు, 40 శాసనసభ స్థానాలకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+