వైయస్ జగన్ 'ఫ్యాన్' రివర్స్ తిరుగుతోందట
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్యాన్ రివర్స్ తిరుగుతోంది! సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ తమ పార్టీల తరఫున టీవిలలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనొస్తున్నాడు.. అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టీవిలలో అదరగొడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ అడ్వర్టయిజ్‌మెంట్లలో ఫ్యాన్ మాత్రం రివర్స్‌లో తిరుగుతోంది. ఆయనొస్తున్నాడు అంటూ వస్తున్న ప్రకటనలలో ఫ్యాన్ రివర్స్‌లో తిరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలలో కథనం వచ్చింది.

ఈ నెల 7వ తేదీన సీమాంధ్రలో లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్‌గా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయిందంటున్నారు.
ఈ నేపథ్యంలో పాలనలో అనుభవం ఉన్న టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, వైయస్ పాలన ఇస్తానని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. ఆయా పార్టీల తరఫున నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి, బిజెపి కూటమికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ మద్దతు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications