జయలలితపై తీర్పు: రెహ్మాన్ వాంగ్మూలం
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలితను కోర్టు దోషిగా నిర్ధారించడంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్, మాండోలిన్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు గంగాయ్ అమరన్ వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో శనివారం వార్తలు వచ్చాయి.
మాండోలిన్ శ్రీనివాస్ ఇటీవల కన్ను మూశారు. విఎన్ సుధాకరన్ పెళ్లిలో తాము ప్రదర్శనలు ఇచ్చినట్లు రెహ్మాన్, శ్రీనివాస్ కోర్టుకు చెప్పారు. అమ్మ ఇష్టపడిందని చెప్పడంతో తాను 1994లో పయ్యనూరులోని తన 22 ఎకరాల ఫామ్‌హౌస్‌ను శశికళకు విక్రయించినట్లు ఇళయరాజ్ తమ్ముడు గంగాయ్ అమరన్ చెప్పారు.

రెహ్మాన్, శ్రీనివాస్ చెప్పిన విషయాలను తాను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చున్హా తన తీర్పులో అన్నారు. వాళ్లిద్దరు కూడా ప్రముఖమైన వ్యక్తులను, స్వతంత్ర సాక్షులని న్యాయమూర్తి అన్నారు. వేదిక వద్ద వారు ఉన్నారని ఆయన అన్నారు.
విఐపిలకు ఇవ్వడానికి వందలాది వెండి పళ్లేలు, సిల్క్ చీరెలు, ధోవతులు సేకరించినట్లు రెహ్మాన్, శ్రీనివాస్ చెప్పినట్లు న్యాయమూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications