కలవాలా..వద్దా: జూఎన్టీఆర్ తికమక, ఆలస్యంగా..

Jr NTR and Chandrababu: A meeting too late
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆలస్యంగా కలిశారా? ఇతరుల ఒత్తిడి మీదనే బాబుతో భేటీ అయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వచ్చి.. టిడిపి ఘన విజయం సాధించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత.. అంటే ఆదివారం బాబును కలిసి అభినందనలు తెలిపారు.

ఫలితాల అనంతరం చంద్రబాబును జూనియర్ చాలా ఆలస్యంగా కలిశారనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పైన ఎలాంటి అసంతృప్తి లేకుంటే ఫలితాల వచ్చిన వెంటనే కలిసే వారని లేదా ఫోన్ చేసి అభినందనలు తెలిపే వారని అంటున్నారు.

రెండు రోజుల తర్వాత అంత ఆలస్యంగా చంద్రబాబుతో భేటీ కావడం ఏదో మొక్కుబడి కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి జూనియర్ ఆదివారం బాబును కలిశారు.

సన్నిహితులు, కుటుంబ సభ్యుల సూచనతో...

చంద్రబాబును కలిసే విషయమై జూ ఎన్టీఆర్ తర్జన భర్జన పడ్డారట. తన తండ్రి నందమూరి హరికృష్ణతో సుదీర్ఘంగా చర్చించారట. అయితే సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. ఒకే కుటుంబ సభ్యులని, భవిష్యత్తులో సంబంధాలు తెంచుకోకుండా ఉండాలంటే కలవడమే మంచిందని సూచించడంతో బాబును కలిసేందుకు సిద్ధమయ్యారట.

కాగా, టిడిపికి మద్దతుగా ప్రచారం చేయక పోవడమే కాకుండా, పార్టీ గెలిచిన తర్వాత రెండు రోజులు ఆలస్యంగా జూనియర్.. చంద్రబాబును కలిశారని, శుక్రవారమే కలవాల్సి ఉండెనని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+