ముందే చెప్పా.. సాధించావ్: టిపై కెసిఆర్‌కు ప్రణబ్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారట! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నీవల్లే సాధ్యమవుతుందని తాను ముందే చెప్పానని, నువ్వు సాధించావని, నువ్వు ఏ తెలంగాణను కావాలని అనుకున్నావో అదే తెలంగాణను చూశావని కెసిఆర్‌తో ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారట.

తెలంగాణను సాధించినందుకు కెసిఆర్‌ను ప్రణబ్ అభినందించారు. ఈ విషయాలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెసిఆర్.. పార్టీ ఎంపీలు, నాయకులను వెంటబెట్టుకుని శనివారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు.

KCR meets Pranab Mukherjee

అనంతరం సమావేశ వివరాలను జితేందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా పెద్దల ఆశీర్వాదాలు తీసుకునేందుకు, కొత్త రాష్ట్రానికి సహకరించాలని కోరేందుకు ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్రపతిని ప్రణబ్‌లను కెసిఆర్ కలిశారన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ వాళ్లెవరూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చూడలేకపోయారని, ఆ జాబితాలో చెన్నారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారని జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 164 దేశాలతో భాగస్వామ్య సదస్సును ఏర్పాటు చేయబోతున్నారని, ఈ సదస్సు తేదీలను త్వరలోనే ఖరారు చేసి దానికి ఆహ్వానించేందుకు మళ్లీ ఢిల్లీ వస్తానని కెసిఆర్ రాష్ట్రపతికి చెప్పారని తెలిపారు. అందుకు రాష్ట్రపతి ఎంతగానో సంతోషించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+