కెసిఆర్ సెంటిమెంట్ కోనాయిపల్లి ఇలా (పిక్చర్స్)
సంగారెడ్డి: మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును నడిపిస్తోంది. కెసిఆర్ ఏ శుభకార్యం తలపెట్టినా కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయటం సంప్రదాయంగా వస్తోంది. బుధవారంనాడు కెసిఆర్ గజ్వేల్ శాసన సభకు, మెదక్ లోకసభ స్థానానికి నామినేషన్ వేయడానికి ముందు ఆయన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
1983లో తొలిసారిగా టిడిపి టికెట్‌పై పోటీ చేసిన సందర్భంగా కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారి వెంకన్నను దర్శించుకున్న తరువాతే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తూ వస్తున్నారు. 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించిన కెసిఆర్ వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2001లో టిడిపికి రాజీనామా చేసి తెరాస పార్టీ ఆవిర్భావ సమయంలో సైతం కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మామ బాటలో హరీష్ రావు..
కెసిఆర్ దారిలోనే ఆయన మేనల్లుడు హరీష్ రావు కూడా నడుస్తున్నారు. 2004 అక్టోబర్ ఉప ఎన్నికల్లో తన్నీరు హరీష్‌రావు మంత్రి హోదాలో తొలిసారిగా బరిలో దిగినప్పుడు కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
నాటినుంచి వరుస విజయాలు సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెదక్ ఎంపిగా పోటీ చేసిన విజయశాంతి సైతం కోనాయిపల్లి వెంకన్న వద్ద ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఎంపిగా విజయం సాధించారు.

కోనాయిపల్లి సెంటిమెంట్
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కోనాయిపల్లి సెంటిమెంట్ ఉంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఆయన ఏ పనైనా మొదలు పెడుతారు.

కోనాయిపల్లికి వచ్చారు..
మెదక్ పార్లమెంటు సీటుకు, గజ్వెల్ అసెంబ్లీ సీటుకు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు బుధవారం కెసిఆర్ కోనాయిపల్లి వచ్చారు. హరీష్ రావు కూడా ఆయనతో పాటు ఉన్నారు.

పూజలు చేసిన కెసిఆర్
కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి, దేవుడికి ఆయన నమస్కారం పెట్టుకున్నారు.

హరీష్ రావుకు కూడా..
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్ఛించుకోవడం కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావుకు కూడా సంప్రదాయంగా వస్తోంది.

తీర్థం తీసుకుంటున్న కెసిఆర్
మెదక్ జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారుల నుంచి తీర్థం స్వీకరిస్తున్న తెరాస అధినేత కెసిఆర్

కెసిఆర్ ఇలా..
కోనాయిపల్లిలో తన నామినేషన్ పత్రాలను దేవుడి ముందు పెట్టి పూజారుల ఆశీస్సులు తీసుకుంటున్న కెసిఆర్

ప్రచారం షురూ..
కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచే కెసిఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications