మోడీ టీ షర్ట్స్: ప్రచార రథంతో కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలోకి ప్రధాన పార్టీలు ఇప్పటికే దిగాయి. ప్రచారానికి కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. కాంగ్రెసును కాదని తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు.
తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి, అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కెసిఆర్ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల్లో ప్రచారం కోసం వాడే వాహనాలు తెరాస సిద్ధం చేసుకుంది.
ఇదిలావుంటే, తెలంగాణలో తెరాసకు తమకూ మధ్యే పోటీ ఉంటుందనే ధీమా వ్యక్తం చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ టీ షర్టులను విడుదల చేశారు. టీ షర్టులపై నరేంద్ర మోడీ పేరు రాసి ఉంది.

మోడీ టీ షర్టులు
రాష్ట్రంలో నరేంద్ర మోడీ టీ షర్టులు హల్‌చల్ చేయనున్నాయి. ఐ యామ్ ఫర్ ఇండియా, ఐ యామ్ ఫర్ మోడీ (భారత్ కోసం నేను, మోడీ కోసం నేను) అని రాసి ఉన్న టీ షర్టులు ముందుకు వచ్చాయి

కిషన్ రెడ్డి ఇలా..
తెలంగాణలో తాము సత్తా చాటుతామనే ధీమాతో ఉన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సందడిగా కనిపించారు.

తెరాస ప్రచార రథం.
.
ఓ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి తయారు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రచార రథం ఇలా ఉంది.

కెసిఆర్ ఇలా..
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఆయన ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications