బావ గల్లా జయదేవ్‌కు మహేష్ బాబు చేయి?
హైదరాబాద్: గుంటూరు లోకసభ స్థానంలో బావ గల్లా జయదేవ్‌కు ప్రిన్స్ మహేష్ బాబు ప్రచారం చేస్తారని విస్తృతంగా పుకార్లు చెలరేగాయి. గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గల్లా జయదేవ్‌కు మహేష్ బాబు పూర్తి స్థాయిలో మద్దకు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ బాబు ఆయన కోసం ప్రచారంలోకి దిగుతారని అనుకున్నారు.
ఇక ప్రచారానికి రెండు రోజులు మాత్రమే వ్యవధి ఉన్న స్థితిలో మహేష్ బాబు ప్రచారానికి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. చివరి క్షణంలో మహేష్ బాబు బావ కోసం రావచ్చునని అనుకున్నారు.

అయితే, కుటుంబంలో విభేదాలు పొడసూపడం కూడా గల్లా జయదేవ్‌కు ఇబ్బందిగా మారింది. మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరి రావు తనకు తెనాలి తెలుగుదేశం టికెట్ దక్కకపోవడం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు దూకడమే కాకుండా తన సోదరుడు, మహేష్ బాబు తండ్రి కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తారని ప్రకటించారు.
ఆదిశేషగిరి రావు ప్రకటనతో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు గందరగోళంలో పడ్డారని అంటున్నారు. ఈ స్థితిలో గల్లా జయదేవ్ మహేష్ బాబు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications