భార్య ఉంది: రోడ్డుపైనే ప్రేయసికి తాళి కట్టేశాడు

Man arrested for marrying another woman
హైదరాబాద్: తన ప్రేయసికి ఓ వివాహితుడు నడిరోడ్డు మీదే తాళి కట్టేశాడు. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ముషీరాబాద్‌కు చెందిన విజయ్ కుమార్ ఇంట్లో ఓ యువతి కుటుంబం రెండేళ్ల పాటు అద్దెకు ఉంది.

ఆ సమయంలో ఆ యువతితో విజయ్ కుమార్ ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు. కానీ ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు. దాంతో విజయ్ కుమార్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది.

అయితే ప్రేయసిని మరిచిపోలేకపోయాడు విజయ్ కుమార్. శుక్రవారం ఆమె కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డగించి ఆమెకు తాళి కట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాగామీర్ బస్తీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంటిలోని సామగ్రితో ఇళ్లు మొత్తం అగ్నికి ఆహుతి అయింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న మహిళ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+