Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనుష్కని కోహ్లీ భార్యగా అని, నాలుక్కర్చుకున్నాడు

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టు చివరి రోజు ఆట సందర్భంగా కామెంటరరీ బాక్స్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్ పొరపాటుగా ఓ వ్యాఖ్య చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా పేర్కొన్నాడంటున్నారు.

అంతలోనే అతను సర్దుకున్నాడని చెబుతున్నారు. కోహ్లీకి కాబోయే భార్యగా చెప్పాడు. ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య మెల్‌‍బోర్న్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఈ రోజు నాలుగో రోజు. ఈ సందర్భంగా మైకేల్ స్లేటర్ ఆ వ్యాఖ్యలు చేశారని సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో వస్తున్నాయి.

Michael Slater Calls Anushka Sharma 'Virat Kohli's Wife'

భారత క్రికెట్ జట్టు క్రీడాకారులతో పాటు వారి భార్యలను ఇటీవల బీసీసీఐ అనుమతించిన విషయం తెలిసిందే. అనంతరం విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మను కూడా అనుమతించింది. దీంతో ఇటీవలె ఆమె మెల్‌బోర్న్‌లో ల్యాండ్ అయింది.

అర్ధరాత్రి అతనితో వీధుల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు అతనిని స్టాండ్స్ నుండి ఉత్సాహపరిచింది. అంతేకాదు రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం బ్యాట్ ద్వారా ఓ ముద్దును అనుష్కకు ఇచ్చాడు. మరో ముద్దును ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు కవ్వించినట్లుగా ఇచ్చాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+