కాబోయే 'మహా' సీఎం ఫడ్నవిస్ మోడలింగ్ చేశారు

నాగపూర్/ముంబై: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన విదర్బ నుండి వచ్చిన నాలుగో, బీజేపీ మొదటి సీఎం. అతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దారిలో నడవాలనుకుంటున్నారి. ఇదిలా ఉండగా.. ఫడ్నవిస్ గతంలో మోడలింగ్ కూడా చేశారట.

నాగపూర్‌లోని ఓ గార్మెంట్ షాపు ప్రచారం కోసం ఆయన ఎనిమిదేళ్ల క్రితం మోడల్ అవతారమెత్తారు. 2006లో ఫడ్నవిస్ బాల్య స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ వివేక్ రణడే ఈ మేరకు ఫోటో షూట్ నిర్వహించారు. పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులను ధరించి ఫడ్నవిస్ ఈ షూట్‌లో పాల్గొన్నరట.

నాగపూర్‌లో వాటికి సంబంధించిన ఐదు భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశామని, ఈ ప్రచారం బాగా విజయవంతమైందని వివేక్ రణడే పేర్కొన్నారు. ఆ హోర్డింగ్‌లు నెలకు పైగా ఉంచామని, ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవిస్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. అఫ్పుడు ఫడ్నవిస్ వయస్సు 36. కాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

'Model' CM: When Devendra Fadnavis posed for a Nagpur garment store

కాగా, 19వ ఏటనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవేంద్ర ఫడ్నివిస్ 44 సంవత్సరాలకే మహారాష్ట్ర సీఎంగా అవుతున్నారు. సంఘ్ పరివార్‌తో అనుబంధమున్న దేవేంద్ర ఫడ్నవిస్ బిజెపిలో కీలక పాత్ర పోషించారు. న్యాయశాస్త్రంలో పట్టాపొందిన ఫడ్నవిస్ తండ్రి ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి 1992 నుంచి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.

ఫడ్నవిస్ రాజకీయాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మార్గనిర్దేశకుడు. నాగపూర్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 21 ఏళ్లకే మున్సిపల్ కార్పొరేటర్‌గా విధులు నిర్వహించారు.

27వ ఏట నాగపూర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989లో నాగపూర్ బిజెపి విద్యార్థి విభాగంలో ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించారు. 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నాగపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఫడ్నవిస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+