మోడీ స్టైల్: నారా లోకేష్ బ్రింగ్ బాబు బ్యాక్

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శైలిలో తెలుగుదేశం పార్టీ కోసం ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పార్టీని అధికారంలోకి తేవడానికి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఆయన బ్రింగ్ బాబు బ్యాక్ పేరుతో ఆయన సరికొత్త ప్రచారానికి తెర తీశారు. శనివారం ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 Nara Lokesh compaign with 'Bring back Babu'

బాబును తిరిగి అధికారంలోకి తెండి అనే నినాదంతో నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్థమవుతోంది. యువతను అందుకు వాహకంగా వాడుకోవాలని ఆయన చూస్తున్నారు. అందుకు ఆయన యువసదస్సులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ కార్యక్రమం పనికి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, నారా లోకేష్ చేపట్టిన ఆ కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన్ కరుణాకర్ రెడ్డి అవహేళన చ ేశారు. చంద్రబాబుది రాక్షస పాలన అని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏం చేశారని ప్రజలు అధికారం కట్టబెడుతారని ఆయన అన్నారు.

గతంలో దెయ్యాలొస్తున్నాయనే భయంతో ప్రజలు ఓ స్త్రీ రేపు రా అని రాసుకునేవారని, ఇప్పుడు చంద్రబాబు నువ్వు ఇక రాకు అనే పరిస్థితులు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన రాకూడదని ప్రజలు పూజలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+