క్యాబినెట్ కూర్పులో నారా లోకేష్ చేయి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గ కూర్పులో ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువత నేత చేయి వేసినట్లు చెబుతున్నారు. 2019లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌ను ముందుకు తేవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడితో పాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, నారా లోకేష్ కలిసి మంత్రి వర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై పట్టు సాధించడానికి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఇటీవలి సాధారణ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక భూమిక పోషించారు.

ప్రచారంలోనే కాకుండా వ్యూహరచనలో కూడా నారా లోకేష్ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రచారం విషయంలో నారా లోకేష్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. నారా లోకేష్‌ను టిడిపి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే ప్రచారం కూడా ఊపందకుంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ రాకపోవడాన్ని తప్పు పడుతూ నారా లోకేష్ ఆదివారంనాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారాన్ని భారీగా నిర్వహించడాన్ని నారా లోకేష్ సమర్థించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి అది అవసరంగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications