రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నిత్యం అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నేత పయ్యావుల కేశవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశఆరు

వివాదాల్లోకి వెళ్లకుండా కష్టపడి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందని పయ్యావుల కేశవ్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో కేశవ్‌, రేవంత్‌ లిద్దరూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా ముచ్చటించుకున్నారు.

Next Telangana CM will be Revanth Reddy?

ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్‌ కాస్తా సీరియస్‌గానే - తెలంగాణలో సీఎం పదవికి నీకు పోటీ వస్తారనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరని అన్నారు. ఈ వ్యాఖ్య రేవంత్‌ రెడ్డిని ఆలోచనలో పడేసినట్లే ఉంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో మాటకారిగా రేవంత్ రెడ్డికి పేరుంది. ప్రత్యర్థులపై వాగ్బాణాలు విసరడంలో ఆయన సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కెసిఆర్‌పై వ్యాఖ్యలు చేయాలంటే ఆయనకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+