కార్యవర్గం రెడీ: పవన్ కళ్యాణ్ ఆస్తులు ఇంతేనా?

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ సినిమా ముహూర్తం కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుకోకపోవడానికి ఎక్కువగా అదే పనిచేసినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర కార్యవర్గ కమిటిని కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ నెల 3వ తేదీనే ఆయన తన పార్టీ కార్యవర్గాన్ని ఎంపిక చేసి వారితో సమావేశం కూడా ఏర్పాటు చేసుకొన్ట్లు తెలిసింది. ఈ కమిటీ వివరాలను ఆయన ఎన్నికల కమిషన్ (ఈసి)కి అందజేసినట్లు సమాచారం.
పార్టీ కార్యాలయం చిరునామాను ఎమ్మెల్యే కాలనీలోని ప్లాట్ నెం.91 బంజారహిల్‌స, హైదరాబాద్‌గా ఈసికి సమర్పించిన దరఖాస్తులు రాసినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆస్తుల వివరాలను కూడా ఈసికి అందజేశారని సమాచారం. రూ.14.80 కోట్లుగా తన ఆదాయాన్ని పవన్ కళ్యాణ్ చూపినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications