‘కలయిక’: తుపాకులతో చిన్నారులు(పిక్చర్స్)
హైదరాబాద్: పోలీసు విధుల స్థితిగతులపై తమ కుటుంబ సభ్యులకు అవగాహన ఏర్పరచడానికి నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిసిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాల కలయిక వల్ల పోలీసులలో ఐకమత్యం పెరుగుతుందని, విధి నిర్వహణలో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిపి.. ఇతర సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. వారి పిల్లలతో ముచ్చటించారు. పిస్తోల్, రివాల్వర్ ఎలా ఉపయోగించాలి, ఆపదలో ఎలా రక్షించుకోవాలి తదితర పలు అంశాలు, జాగ్రత్తలను ఆయన చిన్నారులకు వివరించారు. పోలీసు ఉద్యోగం చేసే వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు.
స్టేషన్‌లో సిబ్బంది నిర్వహించే విధులపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలన్నారు. అప్పుడప్పుడు అందరం కలిసి ఇలా సుహృద్భావ వాతావరణంలో కొద్ది సేపు గడిపితే ఒత్తిడి, అలసట తేలిగ్గా అధిగమించవచ్చని అన్నారు. సాధారణ పౌరుడు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం స్టేషన్లలో ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.
ఫిర్యాదుదారులతో వ్యవహరించే తీరుపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని కమలాసన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అబిడ్స్ ఏసిపి జయపాల్, నారాయణగూడ సిఐ భీంరెడ్డి, డిఐ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్సైలు రాంలాల్, సాధిక్, పి. నరేష్, డేనియల్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఇంద్ర జాలికుడు విజయ్ కాంత్ ప్రదర్శనకు పిల్లలు కేరింతలు కొట్టారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఆత్మీయ కలయిక
పోలీసు విధుల స్థితిగతులపై తమ కుటుంబ సభ్యులకు అవగాహన ఏర్పరచడానికి నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆత్మీయ కలయిక
ఈ సందర్భంగా డిసిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాల కలయిక వల్ల పోలీసులలో ఐకమత్యం పెరుగుతుందని, విధి నిర్వహణలో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు.

ఆత్మీయ కలయిక
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిపి కమలాసన్ రెడ్డి.. ఇతర సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. వారి పిల్లలతో ముచ్చటించారు.

ఆత్మీయ కలయిక
పిస్తోల్, రివాల్వర్ ఎలా ఉపయోగించాలి, ఆపదలో ఎలా రక్షించుకోవాలి తదితర పలు అంశాలు, జాగ్రత్తలను ఆయన చిన్నారులకు వివరించారు.

ఆత్మీయ కలయిక
పోలీసు ఉద్యోగం చేసే వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు.

ఆత్మీయ కలయిక
స్టేషన్‌లో సిబ్బంది నిర్వహించే విధులపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలన్నారు.

ఆత్మీయ కలయిక
అప్పుడప్పుడు అందరం కలిసి ఇలా సుహృద్భావ వాతావరణంలో కొద్ది సేపు గడిపితే ఒత్తిడి, అలసట తేలిగ్గా అధిగమించవచ్చని అన్నారు.

ఆత్మీయ కలయిక
సాధారణ పౌరుడు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం స్టేషన్లలో ఉండాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. ఫిర్యాదుదారులతో వ్యవహరించే తీరుపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని కమలాసన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications