ఈ పవర్ స్టార్ పవన్ కాడు, రజనీయే పోటీ అట

చెన్నై: తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ అనే బిరుదు అభిమానులు ఇస్తే, తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే తనకు తానే శ్రీనివాసన్ ఆ బిరుదు ఇచ్చేసుకున్నాడు. వృత్తిరీత్యా శ్రీనివాసన్ వైద్యుడు. వృత్తిని ప్రక్కనపెట్టి సినీ ఇండస్ట్రీలో యాక్టర్ అవతారమెత్తాడు

తాను కోలీవుడ్ పవర్ స్టార్‌ను అంటూ బిరుదు కూడా ఇచ్చేసుకున్నాడు. అంతటితో అతగాడు ఆగలేదు. 2016 సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎప్పుడు కూడా ఈయనను ఎవరూ అడగక మునుపే తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పేస్తుంటారు.

Power star not Pawan Kalyan, Tamil actor Srinivasan

తనకు రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది అభిమానులు ఉన్నారని అంటున్నాడు. సినిమాల్లో తనకు రజినీకాంత్ మాత్రమే పోటీ అని చెప్పే పవర్ స్టార్ రాజకీయాల్లో మాత్రం తనకు సాటి ఎవరూ లేరని ప్రకటించుకున్నాడు. అన్నట్లు ఈ పవర్ స్టార్ శంకర్ ఐ చిత్రంలో నటించాడట. మరి ఈ చిత్రంతో దశ తిరుగుతుందేమో చూడాలి.

ఎన్నికల వ్యవహారాలు చూసే బాధ్యతను తాను అభిమానులకు అప్పగిస్తానని శ్రీనివాసన్ అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లోగా రాజకీయ పార్టీ పెట్టేసి దుమ్ము దులిపేస్తానని చెబుతున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని, తమిళనాడు ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోనని కూడా చెబుతున్నాడు. ఇతను ఐతో పాటు మరో 12 సినిమాల్లో నటిస్తున్నాడట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+