నవ్వండి రాహుల్ జీ.. నవ్వండి: చిరంజీవి సూచన

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల్లో ఎప్పుడూ ఉదాసీనతతో చివరి బెంచ్ పిల్లాడిలా కనిపించే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ మధ్య కొత్త జోష్‌తో వ్యవహరిస్తున్నారు. అంతేగాక పక్కా రాజకీయ నేతగా రూపాంతరం చెందుతున్నట్టు కనిపిస్తున్నారు.

సమావేశాల్లో, ర్యాలీల్లో అరుపులు పెడబొబ్బలు పెట్టడానికి ఇష్టపడని రాహుల్ గాంధీ.. పార్లమెంట్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ముందుండటంతోపాటు నినాదాలతో హోరెత్తించారు.

అంతేకాకుండా ఎప్పుడూ సీరియస్ కనిపించే ఆయన కొంతకాలంగా నవ్వుతూ.. అందర్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ ముఖంలో చిరుమందహాసానికి కారణమైనవారిలో కేంద్ర మాజీమంత్రి చిరంజీవి కూడా ఒకరు కావడం గమనార్హం.

Rahul Gandhi Advised to Smile More, Be

రాజకీయాలు కూడా ఓ నటన లాంటిదేనని రాహుల్ గాంధీకి ఇటీవల చిరంజీవి సలహా ఇచ్చారట. చిరంజీవి తోపాటు మాజీ కేంద్రమంత్రులు పవన్ కుమార్ బన్సల్, సంజయ్ నిరుపమ్‌లు చిరుమందహాసంతో వ్యవహారాలు నడిపించాలని రాహుల్ గాంధీకి సూచించారట.

రాజకీయాల్లో ప్రభావం చూపాలంటే కుల సమీకరణలను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమని రాహుల్‌కు చిరంజీవి సూచించారట. మొత్తానికి ఎంపీల మాటలు బాగానే పనిచేసినట్లున్నాయి. ఇటీవల అమేథి పర్యటనలోనూ రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+