రూమర్ కాదు!: రాహుల్‌గాంధీతో నటించిన రమ్య
న్యూఢిల్లీ: శాండిల్‌వుడ్ క్వీన్, కాంగ్రెసు పార్టీ మాండ్య పార్లమెంటు సభ్యురాలు రమ్య ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో కలిసి నటించారు. ఇదేదో గాసిప్ లేదా రూమర్ లేదా మీడియా వండివార్చిన వార్త ఏమాత్రం కాదు. ఎన్నికల ప్రచారం మానేసి రాహుల్ గాంధీతో రమ్య ఎందుకు నటించారా? అంటే ఎన్నికల ప్రచారం కోసం.
లోకసభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్త ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించింది. యువతను ప్రోత్సహిస్తున్నట్లుండే ఈ వీడియోలో రాహుల్, రమ్య, నవీన్ జిందాల్, ప్రియాదత్‌లు నటించారు. దీనికి సంబంధించి ఇటీవలే ఢిల్లీలో షూటింగ్ జరిగింది.

ఈ ఫోటో షూట్‌లో రాహుల్, రమ్యలు పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీకి రాహుల్ గాంధీ యూత్ ఐకాన్. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు దేశవ్యాప్తంగా పలువురు యువ నేతలు ఈ షూట్‌లో పాల్గొన్నారు. ఈ యూత్ వీడియోను చూపించి రాహుల్ గాంధీ రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోకసభ ఎన్నికల నామినేషన్లు ముగిశాక ఈ వీడియో ద్వారా ప్రచారం చేపట్టనున్నారు. కాగా, రమ్య మాండ్య నియోజకవర్గం నుండి గత ఉప ఎన్నికల్లో లోకసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె మరోసారి మాండ్య నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications