తారాకు బలం: కోహ్లీకి సెక్స్ రాకెట్‌తో లింక్స్?
రాంచీ: జాతీయ షూటింగ్ చాంపియన్ తారా సహదేవ్ మాజీ భర్త రంజీత్ సింగ్ సింగ్ కోహ్లీ అలియాస్ రకీబుల్ హసన్‌కు సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను విపరీతంగా వేధించాడంటూ రకీబుల్ హసన్‌పై తారా సహదేవ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాంచీ పోలీసులకు వ్యభిచారం ఆరోపణలపై చిక్కిన ఓ అమ్మాయి అతని సెక్స్ రాకెట్ సంబంధాలపై వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్సాయి.
హసన్‌కు రాష్ట్రంలోని పలువురు మంత్రులతో సంబంధాలున్నాయని, వారికి అతను అమ్మాయిలను సరఫరా చేసేవాడని ఆ అమ్మాయి చెప్పినట్లు జీన్యూస్ మీడియాలో ఓ వార్తాకథనం వచ్చింది. ఆ అమ్మాయిని రీనా అధికారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

హసన్ నడిపిస్తున్న వ్యవస్థీకృత సెక్స్ రాకెట్‌లో తాను పాలు పంచుకున్నట్లు, హసన్ నుంచి ప్రత్యేకమైన సూచనలు అందుకున్న తర్వాత తాను హోటల్లో హై ప్రొఫైల్ క్లయింట్లను కలుసుకున్నట్లు ఆమె వెల్లడించినట్లు వార్తాకథనం సారాంశం.
రీనా అధికారిని పోలీసులు బాద్గాయ్ ప్రాంతంలో మరో ఎనిమిది అమ్మాయిలతో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పేరు మోసిన ఢిల్లీ పింప్ సోన్ పంజాబన్ సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నవారని అంటున్నారు. రీనా అధికారి వెల్లడించిన వివరాలను బట్టి హసన్ సెక్స్ రాకెట్ నడుపుతాడనే తారా సహదేవ్ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. తాను సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు హసన్ కూడా పోలీసుల విచారణలో అంగీకరించినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications