జగన్‌కు షాక్: మోడీకి హీరోయిన్ సమంత మద్దతు

హైదరాబాద్: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని కవులు ఊరికే అనలేదని సినిమా హీరోయిన్ సమంత మాటలను పరిశీలిస్తే అర్థమవుతుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సమంత ప్రచారం చేస్తారంటూ వార్తలు వచ్చాయి. దానిపై శుక్రవారం ఓ కార్యక్రమంలో సమంత వివరణ ఇచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో కోన రఘుపతి ఒకరు. కోన రఘుపతి కూతురు కోన నీరజ సమంత పర్సనల్ డ్రెస్ డిజైనర్‌గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోన నీరజ తన తండ్రి తరఫున సమంతను ప్రచారం చేయించడానికి ఒప్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

 Samantha supports Narendra Modi

అయితే, సమంత తనను వివాదంలోకి లాగొద్దని అంటూనే, తాను ఏ పార్టీకీ ప్రచారం చేయడం లేదంటూనే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. తనను అనవసరంగా రాజకీయాల్లోకి లొగ్దదని, తనకు రాజకీయాలపై అసలు ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున ప్రచారం చేయడం లేదని హీరోయిన్ సమంత వివరణ ఇచ్చింది.

సుపరిపాలన అందించే సమర్థుడైన నాయకుడికి ఓటు వేయాలని ఆమె ప్రజలకు సుద్దులు చెప్పారు. మీడియా మిత్రులు తక్కువేమీ తినలేదు. నరేంద్ర మోడీ మానియా గురించి ఆమెను ప్రశ్నించారు. ఆయన సమర్థుడైన నాయకుడని తాను విశ్వసిస్తున్నట్లు సమంత తన మనసులోని మాటను బయటపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+