బ్రాండ్ అంబాసిడర్ సానియా: అత్తగారికి హ్యాపీ

హైదరాబాద్: సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడాన్ని ఆమె అత్త స్వాగతించారు. ఈ రకంగా తమ కోడలికి గుర్తింపు, గౌరవం దక్కడం తమకు ఆనందంగా ఉందని సానియా మీర్జా అత్తగారు, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తల్లి సుల్తానా అన్నట్లు దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక రాసింది.

సానియాకు 2009లో షోయబ్ మాలిక్‌తో నిశ్చితార్థం జరగగా, వారికి 2010 ఏప్రిల్‌లో వివాహం జరిగింది. భారతీయ హోదాపై సానియా వ్యాఖ్యలపై మాట్లడానికి సుల్తానా ఇష్టపడలేదని దక్కన్ క్రానికల్ రాసింది. సియాల్ కోట్ నుంచి సుల్తానా తమతో మాట్లాడినట్లు దక్కన్ క్రానికల్ రాసింది.

Sania Mirza's mother-in-law welcomes her appointment as Telangana brand ambassador

పాకిస్తాన్‌లో రామదాన్ పండుగ సందర్బంగా అత్తగారిల్లు సానియాను మిస్సవుతోంది. ఈ పవిత్ర మాసంలో సానియా తమ వద్ద ఉంటే బాగుండేదని సుల్తానా అన్నారు. వృత్తికారణంగా సానియా చాలా తిరగాల్సి ఉంటుందని, దాంతో ఇక్కడ శాశ్వతంగా ఉండలేదని ఆమె అన్నారు.

సానియా పాకిస్తాన్‌కు మార్చిలో వచ్చిందని, మళ్లీ డిసెంబర్‌లో రావచ్చునని సుల్తానా దక్కన్ క్రానికల్‌తో చెప్పారు. షోయబ్ మాలిక్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+