ఏపీలాంటి విభజనను చరిత్రలో చూడలేదన్న కమిటీ
హైదరాబాద్: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని ఏపీ రాజధానిపై వేసిన శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. శనివారం కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చరిత్రలో ఎన్నడు చూడని విభజన ఇది అన్నారు.
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ను అందరూ కోరుకున్నారని, అవి ఏర్పడిన తీరు వేరని చెప్పారు. కానీ, ఇక్కడ జరిగిన తీరు వేరు అన్నారు. మిగతా రాష్ట్రాలు ప్రజల కోరికతో విడిపోయాయని చెప్పారు. కానీ తాజా విభజన వెనుక పెద్ద నేపథ్యం ఉందన్నారు. దాదాపు అన్ని కార్యాలయాలు, ప్రతి భవనం వివాద కేంద్రంలో ఉందన్నారు.
ఒంగోలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం, విజయనగరంలలో తమ కమిటీ పర్యటించాల్సి ఉందన్నారు. తాగు, సాగునీరు కావాలని, రాయలసీమను ఒక జోన్‌గా అభివృద్ధి చేయాలని అక్కడి నేతలు సూచించారు. శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాలతో లింక్ ఏర్పడుతుందన్నారు. దీన్ని కోస్తాకు కూడా విస్తరిస్తే పోర్టుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు నీళ్లు చాలా ముఖ్యమని, ఈ సమస్యకు పరిష్కారాన్ని ప్రభుత్వానికి సూచించామన్నారు. రాజధాని గురించి విలేకరులు పదేపదే ప్రశ్నించడంతో.. ఇస్లామాబాద్, గాంధీనగర్, చండీగడ్, భవనేశ్వర్, పుత్రజయ, కాన్ బెర్రాల గురించి వారు తెలిపారు. ఇక్కడ ప్రతి చోటా రాజధానికి అనుబంధంగా మరో నగరం నిర్మితమైందన్నారు.
భువనేశ్వర్‌కు కటక్, గాంధీనగర్‌కు అహ్మదాబాద్, ఇస్లామాబాద్‌తకు రావల్పిండిలు చేయూతగా ఉన్నాయన్నారు. ఆర్కిటెక్చరల్ అద్భుతంగా చెప్పుకునే బ్రెజీలియాలో కంటే దాని వెలువలే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారన్నారు. కౌలాలంపూర్ మలేషియా రాజధానిగా కొనసాగుతున్న పుత్రజయలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఇవి అతిముఖ్యమైన పాఠాలు అన్నారు. భువనేశ్వర్ తరహా రాజధాని ఏపీకి సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications