రైనా, శృతి ఎఫైర్: డేటింగ్ చేయట్లేదు.. నమ్మాలని!
ప్రముఖ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనాతో డేటింగ్ ప్రచారం పైన నటి శృతిహాసన్ స్పందించారు. అంతకుముందు రైనా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన పైన ప్రచారం జరుగుతోందని, తాను ఎవరితోను డేటింగ్ చేయట్లేదని రైనా ట్వీట్ చేశారు. ఆ తర్వాత శృతి కూడా ఖండించారు. తాను ఎవరితోను డేటింగ్ చేయడం లేదని రైనా కంటే ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశారు.
తాను ఎక్స్‌ట్రీంలీ, ట్రూత్‌ఫుల్లీ, టోటల్లీ సింగిల్ అని శృతి స్పష్టం చేశారు. తాను మూడు భాషల్లో నటిస్తున్నానని, ఈ బిజీ సమయంలో తనకు శ్వాస పీల్చుకునేందుకు కూడా సమయం చిక్కడం లేదని.. ఇక ఎవరితోనే రిలేషన్‌షిప్‌కు అసలే సమయం లేదని చెప్పారు.
తనలాగే ఆలోచించే వారు తనకు కావాలని, అలాంటి వ్యక్తి తనకు తారాసపడినప్పుడు తాను తప్పకుండా ప్రపంచానికి తెలియజేస్తానని, నన్ను నమ్మండని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను ఏ నటుడిని లేదా ఆటగాడిని ఇష్టపడటం లేదని చెప్పారు. తాను ఎవరితోను ఎప్పుడు డేటింగ్ చేయలేదని చెప్పారు.

రైనా, శృతిహాసన్
దక్షిణాది నటి శృతి హాసన్ ప్రముఖ తెలుగు హీరో సిద్ధార్థతో కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వారు ప్రేమకు ఆ తర్వాత ఫుల్‌స్టాప్ పడిందంటారు.

రైనా, శృతిహాసన్
సురేష్ రైనా, నటి అనుష్క శర్మలు ప్రేమలో ఉన్నట్లుగా పలుమార్లు వార్తలు వచ్చాయి. వారిద్దరు కలిసి పలుమార్లు ఓ చోట మీడియాకు చిక్కినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రైనా, శృతిహాసన్
సురేష్ రైనా గతంలో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణా పటేల్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వారిద్దరు ఓ వద్ద కనిపించడంతో ప్రచారం జరిగింది.

రైనా, శృతిహాసన్
క్రికెటర్ సురేష్ రైనా దక్షిణాది నటి శృతి హాసన్‌తో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు రాగా.. వాటిని ఇరువురు కూడా ఖండించారు. తాము డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు.

శృతిహాసన్, ధనుష్
శృతిహాసన్, ధనుష్‌ల మధ్య కూడా ఏదో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. వారిద్దరు కలిసి పలు ఫంక్షన్లు, పార్టీలలో కనిపించారు కూడా.

శృతిహాసన్, గిరీష్ కుమార్
శృతిహాసన్ రామయ్యా వస్తావయ్య కో స్టార్ గిరీష్ కుమార్‌తో డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇది ఓ పబ్లిసిటీ స్టంట్‌గా తర్వాత ప్రచారం జరిగింది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications