మీడియాకు టోకరా ఇచ్చిన నిత్యానంద
బెంగళూర్: వివాదాస్పద స్వామి నిత్యానంద మీడియా నుంచి తప్పుకోవడంలో అత్యంత సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. నిత్యానంద లైంగిక సామర్థ్య పరీక్షలకు వెళ్తాడని సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి బిదాడిలోని ధ్యానపీఠం ఆశ్రమం రెండు ద్వారాల వద్ద కాపు కాస్తూ ఉండిపోయారు.
నిత్యానందను పోలిన ఓ వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి ముఖాన్ని చాటు చేసుకుని ప్రధాన ద్వారం గుండా వాహనంలో బయటకు వచ్చాడు. దాంతో నిత్యానంద బయటకు వచ్చాడని భావించి మీడియా ప్రతినిధులు ఆ వాహనాన్ని కొంత దూరం అనుసరించారు. అయితే, ఆ వాహనం యూటర్న్ తీసుకుని మళ్లీ ఆశ్రమానికి చేరుకోవడంతో తమకు టోకరా ఇచ్చారని మీడియా ప్రతినిధులు గ్రహించారు.

అప్పటికి ఉదయం 7 గంటల 40 నిమిషాలు అయింది. అప్పటికే నిత్యానంద విక్టోరియా ఆస్పత్రికి చేరుకున్నట్లు మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. నిత్యానందకు లైంగిక సామర్థ్య పరీక్షలు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు సాగాయి.
అయితే, నిత్యానంద మీడియాకు ఎదురు కావడానికి ఇష్టం లేక బయటకు కూడా రాలేదు. కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకోవడానికి నిత్యానంద వైద్యులను అడిగాడు. నిత్యానంద శిష్యులు ఫలాలు, ఇతర తినుబండారాలను లోనికి తీసుకుని వెళ్లారు. చివరకు తనదైన నవ్వు మాయమైన స్థితిలో నిత్యానంద సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చాడు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications