లక్ష్మినారాయణకు రాజకీయ గిరాకీ: బిజెపి గాలం

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ డిప్యుటేషన్‌లో భాగంగా సీబీఐ జేడీగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత సుమారు 9 నెలలపాటు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే ఆయనను థానే జాయింట్ కమిషనర్‌గా నియమించింది. లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో వివిద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయనను సంప్రదించి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం బీజేపీలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిజెపి నేతలు లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు లక్ష్మీనారాయణతో మాట్లాడినట్లు తెలిసింది. ఒకవేళ ఆయన బిజెపిలో చేరితే కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశముందని అంటున్నారు. లేకపోతే మల్కాజిగిరి స్థానానికి పోటీ చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications