ఆ రోజు సల్మాన్ చెల్లె అర్పితా ఉద్వేగ ప్రసంగం
హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు, దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తన చెల్లె పెళ్లికి సల్మాన్ చేసిన ధూమ్ ధామ్ ఏర్పాట్లపైనే అందరి దృష్టి ఉంటూ వచ్చింది. పెళ్లికి జరుగుతున్న ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ ఆసక్తితో గమనిస్తూ వచ్చారు. పెళ్లికి ఎవరెవరు హాజరవుతారనేది, హాజరయ్యారనే విషయంపై కూడా అందరూ ఆసక్తి ప్రదర్శించారు.
అయితే, వివాహం రోజు అర్పితా ఖాన్ ఓ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారనే విషయం చాలా మందికి తెలియదు. ఓ ప్రముఖ దినపత్రిక ఆ విషయం వార్తాకథనంగా వచ్చింది. అత్యంత ఉద్వేగానికి గురైన అర్పితా ప్రసంగం కోసం కొద్దిగా రాసుకుందట. దాన్ని కళ్యాణం రోజు చదవాలని అనుకుంది. తీరా ఆ క్షణం వచ్చే సరికి మాట పెగలలేదట. అంతగా ఆమె ఉద్వేగానికి గురైందట.

ఆమె తరఫున చదవాలని హీరోయన్ ప్రియాంక చోప్రాకు సూచించారని ఆ వార్తాకథనం తెలిపింది. దాంతో ప్రియాంక చోప్రా ఆ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఖాన్స్ వంటి కుటుంబంలోకి తాను రావడం ఎంతో అదృష్టమని అర్పితా ఖాన్ ప్రసంగంలో అభిప్రాయపడిందట.
కుటుంబం శక్తికి తన సోదరులు స్తంభాలని ఆమె అన్నది.. సొహైల్, అర్బాజ్, సల్మాన్‌లకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పింది. సలీం ఖాన్, సల్మా, హెలెన్ తన తల్లిదండ్రులు కావడం తాను చేసుకున్న అదృష్టమని చెప్పింది. అర్పిత ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆయుష్ శర్మను ఈ నెల 18వ తేదీన హైదరాబాదులోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం చేసుకుంది.












Click it and Unblock the Notifications