హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను కులం పేరుతో తిట్టిన భర్త అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాళి కట్టిన భార్యను ఓ భర్త కులం పేరుతో దూషించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు అతనిని అరెస్టు చేసిన సంఘటన హైదరాబాదులో జరిగింది. తనను తన భర్త కులం పేరుతో దూషిస్తున్నాడని భర్త పైన సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

దీంతో అతని పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగేశ్వర రావు నగర్‌లో నివసించే ముప్పయ్యేళ్ల విజయవర్ధన్‌కు కొత్తపేట ఆర్కేపురంకు చెందిన కీర్తితో కొంతకాలం క్రితం వివాహం జరిగింది.

Wife faces caste abuse by husband

కీర్తి తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు. కీర్తి తండ్రి కులానికి చెందిన విజయవర్దన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్త తల్లితో కలిసి కులం పేరుతో దూషిస్తున్నాడని గత నెల 6వ తేదీన కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

English summary
Wife faces caste abuse by her husband in Hyderabad, he was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X