చంద్రబాబు ప్రమాణానికి కెసిఆర్ వెళ్తారా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ వెళ్తారా అనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రావడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరోక్షంగా స్పష్టం చేసినట్టు తెలిసింది.

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయన్న మంగళవారం సచివాలయానికి వచ్చి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించకపోవడం ‘కమ్యూనికేషన్ గ్యాప్'గా కెసిఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

 Will KCR attend Chandrababu swearing in ceremony?

తన కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో తాను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లడం భావ్యం కాదని కెసిఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తమ అధినేత ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్వయంగా ఆహ్వానించడానికి వచ్చినట్టు ఎల్ రమణ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసినట్టు ఆయన తెలిపారు.

ఎన్నికలలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వానికి టిటిడిపి మద్దతు ఉంటుందని కెసిఆర్‌కు హామీ ఇచ్చినట్టు రమణ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి తమ అధినేతతో పాటు, తమకు ఆహ్వానం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా రమణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+