వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంలా మాట్లాడి... డబ్బు డిమాండ్ చేసిన యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గొంతును అనుకరించి ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఖార్దా ప్రాంతానికి చెందిన అనన్య బిశ్వాస్.. తృణమూల్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు ఫోన్ చేసింది.

మమతా బెనర్జీని అనుకరిస్తూ మాట్లాడింది. తాను దీదీని మాట్లాడుతున్నానని, సంక్షేమ కార్యక్రమానికి రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. ఆ నేతలు నంబరును పోలీసులకు ఇ్వగా వారు ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన పశ్చిమ 24 పరగణాల జిల్లాలో జరిగింది.

Woman fakes CM Mamata's voice to demand money, arrested

బరాక్‌పూర్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ (డిటెక్టివ్ డిపార్టుమెంట్) సీ సుధాకర్ శనివారం మాట్లాడుతూ.. అనన్య బిస్వాస్ ఖార్దాకు చెందిన మహిళ అని, మమత గొంతును అనుకరించి డబ్బులు డిమాండ్ చేసినందుకు ఆమెను రెండు రోజుల క్రితం అరెస్టు చేశామని చెప్పారు.

English summary
A woman has been arrested for impersonating West Bengal Chief Minister Mamata Banerjee over phone in North 24-Parganas district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X