సీన్ రివర్స్: జగన్‌కు 'పులివెందుల' షాకిచ్చింది!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జన సందడి తగ్గిందట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల కార్యాలయం వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదంటున్నారు. వైయస్ జగన్వస్తున్నారంటే కడప, పులివెందులలోని ఆయన కార్యాలయం ఒకప్పుడు కిటకిటలాడేది.
భారీగా తరలి వచ్చే జనాలతో దాదాపు ఊపిరాడకుండా ఉండేది. అయితే, జగన్ గురువారం రోజు పులివెందుల వస్తున్నారని ముందే సమాచారం ఉంది. అయినప్పటికీ జనాలు రాలేదంటున్నారు. జగన్ వస్తున్నారని తెలిసినా జనాలు పెద్దగా రాకపోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యపోయారట.

గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు కూడా జగన్ కార్యాలయ ఆవరణలో పెద్దగా జన సందడి కనిపించలేదంటున్నారు. జగన్ ఉన్న గది వద్ద అయితే కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయింది. దీంతో ఆ ప్రభావం కనిపిస్తోందని అంటున్నారు. అంతేకాదు, హైదరాబాదులోని కార్యాలయం వద్ద కూడా గతంలో ఉన్నంత సందడి కనిపించడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications