ఏ ఉద్వేగం లేదు, రామలింగ రాజుకు '9' కష్టాలు!
హైదరాబాద్: సత్యం కుంభకోణంలో శిక్ష పడిన రామలింగ రాజు జైలు జీవితానికి ఫిక్స్ అయినట్లున్నారు! జైలుకు వెళ్లాలంటే ఎవరైనా సంశయిస్తారు. భావోద్వేగానికి గురవుతారు. కానీ దేశంలోనే అతిపెద్ద వైట్ కాలర్ కుంభకోణంగా చెప్పుకునే సత్యం రామలింగ రాజులో మాత్రం అంతగా భావోద్వేగాలు కనిపించలేదని అంటున్నారు. అతను మీడియాకు కూడా ముఖం చాటేసే ప్రయత్నం చేయలేదు.
శిక్ష తప్పదని గ్రహించినట్లుగా, తీర్పు ఎలా వచ్చినా మానసికంగా సిద్ధమైనట్లుగా కనిపించిందని అంటున్నారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో కోర్టుకు వచ్చినప్పుడు.. మిగతా నిందితులలో కనిపించిన ఉద్వేగం ఆయనలో కనిపించలేదంటున్నారు.

ఆయన ముఖంలో తప్పు విషాదఛాయలు కనిపించాయే తప్ప అంతగా భావోద్వేగం నిపించలేదంటున్నారు. జైలుకు తరలించే సమయంలో మిగతా దోషులు ముఖం దాచుకునే ప్రయత్నం చేశారు. కానీ రామలింగ రాజు మాత్రం అలా చేయలేదు.
తొమ్మిది అంకె సత్యం రామలింగరాజుకు అరిష్టంగా మారిందంటున్నారు. ఆయన సత్యం కుంభకోణంలో ఆయన అరెస్టయింది 2009 జనవరి 8న. నెల, తేదీ కలిపితే తొమ్మిది. సంవత్సరం కూడా 09. అరెస్టైనప్పుడు ఆయన ఉన్న ఇంటి నెంబర్ మొత్తం కూడితే తొమ్మిది వస్తుందట. రామలింగరాజును అరెస్టు చేసి జైలుకు తరలించిన కారు నెంబర్‌కూడా తొమ్మిది. రెండుసార్లు వాయిదాపడి తుది తీర్పు వెలువరించిన తేదీ కూడా తొమ్మిదే కావడం గమనార్హం.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications