‘ప్రియుడితో పెళ్లి జరిపించండి.. లేదంటే చస్తా’

వరంగల్: తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని, లేదంటే సెల్ టవర్ పైనుంచి దూకి చస్తానంటూ ఓ యువతి బెదిరింపులు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లా గూడూరులో గురువారం ఉదయం చోటు చేసుకుంది.

ప్రేమ పేరిట ఓ యువకుడు తనను మోసం చేశాడని ఆరోపించిన ఆ యువతి, అతడితోనే తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకుంటే టవర్‌పై నుంచి దూకి చస్తానని ఆ యువతి హెచ్చరించింది.

యువతి హెచ్చరికల నేపథ్యంలో గూడూరులో కలకలం రేగింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

A girl climbs cell tower for her lover

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ డివిజన్ సెంట్రల్ బస్తీకి చెందిన మద్దిబోయిన అశోక్ బ్యాంకు ఉద్యోగిగా పని చేసి పదవీవిరమణ పొందారు.

ఇంటి పక్కనే ఉన్న మహిళ పట్ల ఇతను గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె భర్త సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+