ఉప్పందించింది: అవినీతి భర్తను పట్టించిన భార్య

గాంధీనగర్: ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెడుతున్న భర్త గురించి అధికారులకు ఉప్పందించి, అతనిని పట్టించింది ఓ గుజరాతీ మహిళ. భర్త అక్రమంగా సంపాదించడాన్ని స్వయంగా భార్యనే అధికారులకు సమాచారం ఇచ్చింది.

కమలేష్‌ గోర్డియా అనే ఈ వ్యక్తి గుజరాత్‌లో డిప్యూటీ కలెక్టరుగా పని చేస్తున్నాడు. అతి కొద్దికాలంలోనే అతను లంచాల మీద బాగా సంపాదించాడు. అయితే ఊహించని రీతిలో శుక్రవారం నాడు ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు.

ACB raids in Gujarat

కోటి రూపాయలకు పైగా ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఆయన నివాసంలో పలు బ్యాంకు బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, 32 లక్షల విలువైన ఇంటి పత్రాలు, మరికొంత భూమి దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఆయనపై విచారణ చేస్తున్నారు. ఆయన నుంచి వేరుగా ఉంటున్న ఆయన భార్యే ఈ అక్రమార్జనకు సంబంధించిన వివరాలన్నీ వారికి చెప్పిందంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+