Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓ మంచి పనికోసం నటి కస్తూరి అర్ధనగ్నంగా ఫోజు

హైదరాబాద్: దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి అర్ధనగ్నంగా ఒక చంటి బిడ్డను గుండెలకు హత్తుకున్నట్లు కెమెరాకు పోజులిచ్చారు. ఇప్పుడవి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఆమె ఓ మంచి పని కోసమే ఇలా అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. అమెరికాకు చెందిన జెడ్ అనే నిశ్చల కెమెరామెన్ గర్భిణి స్త్రీల సమస్యలు, ప్రసవం అనంతరం గురయ్యే సుఖ వ్యాధులు క్యాన్సర్, గర్భసంచి సమస్యలపై అవగాహన కలిగించేలా ఏ బ్యూటీపుల్ ప్రాజెక్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించనున్నారు.

 Actress Kasthuri goes topless for a good cause

ఈ పుస్తకం కోసం నటి కస్తూరి అర్ధనగ్న పోజులిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడుతున్న ఈ పుస్తకంలో కస్తూరిలా మరో 80 మంది స్త్రీలు ఈ తరహా ఫోజులతో కెమెరాకు ఫోజులిచ్చారు. దీనిపై అమె మాట్లాడుతూ ఓ మంచి ప్రయత్నం కోసం తన ఇమేజిని పక్కనబెట్టి ఈ అర్ధనగ్న ఫోజులిచ్చానన్నారు.

ఇక నటి కస్తూరి విషయానికి వస్తే తమిళంలో ఆత్తా ఉన్‌కోయిలిలే చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసి చిన్నవర్, సెంతమిళ్‌పాట్టు తదితర చిత్రాల్లో నటించారు. కార్తీక్, ప్రభు, ప్రశాంత్ తదితర నటులకు జంటగా నటించి గుర్తింపు పొందారు.

తెలుగులోనూ అన్నమయ్య, రవితేజ డాన్ శ్రీను లాంటి పలు చిత్రాల్లో నటించారు. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్న కస్తూరి ఆ మధ్య నాంగ చిత్రం ద్వారా రీఎంట్రీ చేశారు. అయితే రీఎంట్రీ ఆమెను కథానాయికగా నిలబెట్టలేక పోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+