ఇషాంత్ నోరు జారాడు: డిన్నరెప్పుడని అడిగానని..

కొలంబో: శ్రీలంకతో సిరీస్‌లో భారత బౌలర్ ఇషాంత్ శర్మ బంతితో కాకుండా నోటితో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. గత మ్యాచ్‌లో జరిమానాకు గురైనప్పటికీ ఇషాంత్ శర్మ తనను తాను నియంత్రించుకోవడం లేదు. తన బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదు ర్కొంటూ క్రీజులో కుదురుకున్న హెరాత్‌ పై నోరు పారేసుకున్నాడు.

శ్రీలంకపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు 32వ ఓవర్లో ఇషాంత్ విసిరిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని హెరాత్‌ తప్పించుకున్నాడు. దీంతో ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. ఆపై ఇద్దరూ తిట్టుకోవడంతో అంపైర్లు, కోహ్లీ వారిని విడదీశారు.

asked Kusal Perera what time you’re going to come for dinner: Ishant Sharma

తన తర్వాతి ఓవర్లోనే కుశాల్‌ పెరీరను అవుట్‌ చేసిన ఇషాంత్‌ అతను మైదానం వీడుతున్నప్పుడు మళ్లీ నోరు జారాడు. ఈ ఘటనపై మ్యాచ్‌ అనంతరం ఇషాంత్ మాట్లాడాడు. తన మాటలకు గమ్మత్తయిన ట్విస్ట్ ఇచ్చాడు ‘అతను నాకు మంచి మిత్రుడే. నాతో డిన్నర్‌కు ఎప్పుడు వస్తావని అడిగానంతే' అని చెప్పుకొచ్చాడు.

తన రన్నప్‌ను కాస్తా తగ్గించుకున్నానని, బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఆనందించానని, గ్రీన్ వికెట్ మీద బౌలింగ్ చేయడం ఆనందాన్నిచ్చిందని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+