మోడీపై ఆజం వ్యంగ్యం: చీపురు, పెన్ బహుమతి
లక్నో: అవకాశం చిక్కితే అదనుగా ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడే ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఒక చీపురు, ఒక పెన్ బహుమతిగా ఇవ్వడమే కాకుండా సమాజంలోని రుగ్మతలను ఎదుర్కోవడానికి ఆ రెండింటిలో ఏది అవసరమో నిర్ణయించాలని కోరుతూ ఒక లేఖ కూడా రాశారు.
‘నేను మీకు రెండు బహుమతులు ఇస్తున్నాను. ఈ రెండింటిలో ఏది సమాజంలోని పాపాలను తుడిచిపెడ్తుందో, కేవలం నినాదాలతో సమాజాన్ని బాగు చేయలేమని ఏది మీకు గుర్తు చేస్తుందో మీరు నిర్ణయించాలి' అని ఆజమ్‌ఖాన్ ఆ లేఖలో సూచించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శగానే ఆజమ్ ఖాన్ ఎమ్మెల్యేలకు ఈ బహుమతులు పంపించారని ఎవరికైనా అర్థమవుతుంది.

మంత్రి అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా మోడీ ప్రజల చేతికి చీపురు ఇచ్చి వారినుంచి కలాన్ని లాక్కున్నారంటూ ఆయనపై విమర్శలు చేశారు. ఈ నెల 26న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పెన్, చీపురు, ఉత్తరంతో కూడిన స్ట్రోలీ బ్యాగులను ఆయన ఎమ్మెల్యేలకు పంపించారు. ‘మీరు నన్ను ఎంతో కాలంగా చూడడమే కాకుండా పరీక్షించారు కూడా. జనం అందరూ చెప్పుకునేటువంటి వ్యక్తినికాదని, భిన్నమైన వాడినని మీ మనసులకు తెలుసు. మీరంతా నిజాయితీపరులని, నిజాన్ని గ్రహిస్తారని నాకు తెలుసు' అని కూడా ఆజమ్‌ఖాన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ బహుమతులపై బిజెపి ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ స్వచ్శ్ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రధాని సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చారని, దాన్ని ఆజమ్‌ఖాన్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. తనకు కూడా ఈ కానుకలు అందాయని, అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తాను తన నియోజకవర్గానికి వెళ్లిపోయినందున ఇప్పటిదాకా ఆ లేఖను చూడలేదని బిఎస్పీ ఎమ్మెల్యే రాంప్రసాద్ చౌదరి చెప్పారు. కాగా, సమాజ్‌వాది పార్టీ, బిజెపి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే విషయాన్ని ఈ బహుమతి ద్వారా అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications