వెరైటీ మ్యారేజీ: బాహుబలిని పెళ్లాడిన రుద్రమదేవి..!

అమరావతి: బాహుబలిని పెళ్లాడిన రుద్రమదేవి. ఈ వార్త వినగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. అంతేకాదు రుద్రమదేవి అనుష్క.. బాహుబలి ప్రభాస్ ను పెళ్లాడేసిందా అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటుపడ్డట్టే. వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బుధవారం ఒక కిట్టీ పార్టీ ఈ వినూత్న పెళ్లికి వేదికైంది.

పచ్చిపులుసు అన్నపూర్ణ అనే మహిళ నేతృత్వంలో మరో 22 మంది టీన్స్‌కిట్టీ పేరుతో సంఘంగా ఏర్పడి నెలకోసారి వేర్వేరు ప్రాంతాల్లో కిట్టీ పార్టీలు నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ జగత్తులో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రెండు సినిమాల్లోని పాత్రలైన బాహుబలి, రుద్రమదేవిలకు వివాహం జరపాలని అనుకున్నారు.

Bahubali and rudramadevi marriage in kitty party

బాహుబలిని వరుడుగా, రుద్రమదేవిని వధువుగా పేర్కొంటూ శుభలేఖలు వేసి, కిట్టీ పార్టీలో వివాహవేడుక జరిపారు. నిజ జీవితంలో పెళ్లి ఎలా అయితే జరుగుుతుందో అదే విధంగా సంప్రదాయాల పాటించి ఈ వివాహం జరిపించారు.

Bahubali and rudramadevi marriage in kitty party

వరుడు వధువుగా ఇద్దరు మహిళలు సంప్రదాయ అలంకరణతో పాల్గొనగా, రెండు బొమ్మలకు అదే వేషధారణ చేసి కల్యాణం జరిపించారు. పానకాల కావిడి, మెహందీ, ఉంగరాలు మార్చుకోవడం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేడుకగా నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+