రేవంత్ అరెస్ట్, మలుపు: నోట్ల బ్యాంక్ ట్యాగ్స్ తీసేశారు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలంటూ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో డీల్ కుదిర్చేందుకు ప్రయత్నించిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆదివారం సాయంత్రం ఏసీబీ అరెస్టు చేసింది. అయితే, సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్ల పైన బ్యాంక్ ట్యాగ్ లేదు.
ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు చెప్పారు. రూ.500 కోట్ల బండల్స్‌తో కూడిన రెండు సంచులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఒకటి కర్రల సంచి, రెండోది నల్లటి బ్యాగ్. వాటిలో రూ.500 నోట్లు ఉన్నాయి.
సంచులలో ఉన్న నోట్లలో బ్యాంక్ ట్యాగ్స్ లేవని అధికారులు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే వాటిని తీసివేసి ఉంటారని చెప్పారు. ఆ నోట్లు ఎక్కడి నుండి లేదా ఏ బ్యాంక్ నుండి తీసుకు వచ్చారో తెలియకుండా ఉండేందుకే తీసివేసి ఉంటారని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఆదివారం సంచలన మలుపు తిరిగింది. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడైన స్టీఫెన్ సన్ ఓటు కోసం తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న రూ.5కోట్ల బేరం వ్యవహారం బహిర్గతమైపోయింది. పక్కా ఆధారాలతోనే రేవంత్‌ను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు.
ఆయన్ని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. గత రెండు రోజులుగా స్టీఫెన్ సన్‌తో రేవంత్ బేరమాడినట్టుగా కథనాలు వచ్చాయి. ఐదుకోట్ల బేరంలో భాగంగా 50లక్షల అడ్వాన్స్‌ను ఇస్తూండగా రేవంత్‌ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications