చంద్రబాబు ప్లాన్: అమరావతిలో ఇంటికి స్థలం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమవరావతిలో ఇల్లు కట్టుకునే యోచనలో ఉన్నారట. అందుకు అవసరమైన స్థలాన్ని కూడా కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాజధానిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే, చంద్రబాబు తన సొంత ఇంటిని కూడా అక్కడ కట్టుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు విజయవాడలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు.

విజయవాడలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు వీలుగా ఉంటే ఏదైనా ప్రభుత్వ భవనాన్ని తీసుకోవాలని, ఒకవేళ దొరకకపోతే ప్రైవేటు భవనాన్ని అయినా అద్దెకు తీసుకుని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారట. నివాసంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
తుళ్లూరు ప్రాంతంలో ప్రస్తుతం వసతులు లేనందువల్ల విజయవాడలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications