వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఒక్కదాంట్లో పవన్ కళ్యాణ్‌కు చిరు దూరమే?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయాల విషయంలో మాత్రమే తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో మెగాస్టార్, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విభేదిస్తున్నారట. ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో వెల్లడించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తనకు రెండు కళ్ల వంటి వారని ఆయన అంటున్నారు. రాజకీయాలు, సినిమాలు వేర్వేరని, వాటికి కుటుంబ సబంధాలకు ఎలాంటి సంబంధాలు లేవని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.

కుటుంబ సంబంధాలను దూరం చేసుకోబోమని, ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తుంటామని చిరంజీవి అన్నారు. అలా కలిసిన సందర్భాల్లో రాజకీయాల గురించి చర్చ తమ మధ్య రాబోదని చిరంజీవి అన్నారు. పవన్ పాలిటిక్స్ డిఫరెంట్ అని, అవన్నీ ఇంటికి బయటే వదిలిపెట్టి వచ్చేస్తాడని చిరంజీవి చెప్పారు.

Chiranjeevi differs with Pawan Kalyan on politics

కాగా, మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్, ఆమీర్ ఖాన్‌లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరితోపాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను చిరు తనయుడు ఆహ్వానించారు. చిరు బర్త్‌డే పార్టీ పనులన్నీ రామ్ చరణ్ దగ్గరుండి మరి చూసుకుంటున్నారు.

ఈ బర్త్‌డే పార్టీకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని మెగా సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ప్రతి యేటా ఆగస్ట్ 22 చిరు బర్త్ డేను పెద్ద పండుగలా జరుపుకునే మెగా అభిమానులకు ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఇది షష్టి పూర్తి సంవత్సరం కావడం విశేషం.

English summary
It is said that Megastar and Congress MP Chiranjeevi is differing with Jana Sena chief Pawan Kalyan's politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X