'సన్నీ ప్రకటనతో అత్యాచారాలు పెరుగుతాయి'

న్యూఢిల్లీ: బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ చేసిన కండోమ్ ప్రకటన వల్ల భవిష్యత్తులో మరిన్ని అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ హెచ్చరించారు.

సన్నీ లియోన్ నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రకటనలు సురక్షిత శృంగారానికి అవకాశం కల్పించడం కంటే కూడా.. అత్యాచారాలు పెరిగేందుకే దోహదపడుతుందని అభిప్రాయపడుతుందన్నారు.

CPI's Atul Kumar Anjan Says Sunny Leone's Condom ad Will Increase Rape

తన జీవితంలో ఎప్పుడూ పోర్న్ వీడియోలు చూడలేదని చెప్పారు. కాగా, 'మ్యాన్ ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది. అయితే, అతుల్ కుమార్ వ్యాఖ్యల గురించి సన్నీ లియోన్ మాత్రం ఎక్కడా స్పందించినట్లు లేదు.

కాగా, సన్నీ లియోన్ మీద విమర్శలు గుప్పించడం, ఆమెపై కేసులు పెట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె చిత్రాలు అసభ్యంగా ఉన్నాయంటూ ముంబైలో ఒక మహిళ సన్నీపై కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+