‘ముద్దుకు అడ్డమనడంతో గడ్డం తీసేశాడు’

లాస్ ఏంజెల్స్: తన భార్యను ముద్దడిగిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గడ్డం ఉండగా తనకు ముద్దవ్వలేనని అతని భార్య విక్టోరియా బెక్ హమ్ తేల్చి చెప్పింది. దీంతో ముద్దు కన్నా గడ్డం పెద్ద ముఖ్యం కాదని అనుకున్న డేవిడ్.. వెంటనే తన గడ్డాన్ని తొలగించి స్మార్ట్‌గా తయరయ్యాడు.

గడ్డంతో ఉండగానే అందంగా ఉండే ఈ 39ఏళ్ల ఆటగాడు.. గడ్డం తీసేయడంతో మరింత అందంగా తయారయ్యాడు. తనను మియామీలో చూసిన విక్టోరియా చాలా ఇష్టపడిందని చెప్పాడు. అయితే తనకు ముద్దు ఇవ్వమని అడిగితే మాత్రం ఇవ్వలేదట. ఎందుకంటే గడ్డం ఉండగా.. ముద్దివ్వలేనని చెప్పిందట.

David Beckham shaved beard for wife Victoria

దీంతో ముద్దు కోసం ఒక రోజు తర్వాత వచ్చిన తాను గడ్డం చేసుకుని వచ్చినట్లు తెలిపాడు. తన భార్య విక్టోరియాకు తాను గడ్డంతో ఉండటం ఇష్టముండదని చెప్పాడు. అయితే తన పిల్లలు బ్రూక్ లిన్, రోమియో, క్రూజ్, హార్పర్‌లకు మాత్రం ఇష్టమని తెలిపాడు.

తన భార్య గురించి చెబుతూ.. ఆమె చాలా నిజాయితీగా ఉంటుందని తెలిపాడు. తన భార్య ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెబుతుందని పేర్కొన్నాడు. ఆమె తనకు ఇచ్చే సలహాలు ఎంతో దార్శనికతతో కూడి ఉంటాయని కొనియాడాడు. అందుకే ఆమె చెప్పే సలహాలు 99శాతం పాటిస్తానని బెక్ హమ్ చెప్పాడు. అంతేగాక, విక్టోరియా వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+