శునకానికి హేపీ బర్త్ డే: ఖర్చు రూ. లక్ష (ఫొటోలు)
విశాఖపట్నం: జన్మదినం జరుపుకోవడం ఎవరికైనా ఆనందకరమైన విషయమే. మనుషులు తమ జన్మదినం వేడుకలను భిన్నంగా జరుపుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, కొందరికి ఆ జన్మదిన వేడుకలు జరుపుకునే వెసులుబాటు కూడా ఉండదు. కానీ ఓ శునకరాజానికి ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి.
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు లక్ష రూపాయలు ఖర్చు చేసి పుట్టిన రోజు జరిపించాడు. గత ఆరేళ్లుగా ఆయన తన పెంపుడు కుక్కకు జన్మదిన వేడుకలు జరిపిస్తున్నాడంటే, ఆయన ఎంత జంతు ప్రేమికుడో అర్ధం చేసుకోవచ్చు.
విశాఖపట్నంలోని స్థానిక శాలిపేటకు చెందిన ఆక్వా ఎక్స్‌పోర్టర్ ఎండి ఖాసిమ్ గత ఆరేళ్లుగా ఒక మగ కుక్కను పెంచుకుంటున్నాడు. దానిపేరు రాఖీబాబు. ఆ కుక్క అంటే తనకే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న జనమందరికీ ఎంతో ప్రేమ. రాఖీబాబు పుట్టిన రోజు వేడుకలను ఖాసిం ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటాడు.

శునకరాజానికి జన్మదిన వేడుకలు
ఎప్పటిలాగే రాఖీబాబు పుట్టిన రోజును శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

శునకరాజానికి జన్మదిన వేడుకలు
25 వేల రూపాయలు ఖర్చు చేసి వంద కిలోల కేక్‌ను కొనుగోలు చేసి, ఆ కుక్కతో కట్ చేయించారు.

శునకరాజానికి జన్మదిన వేడుకలు
సుమారు వంద మందికి దుస్తులు పంపిణీ చేశారు. మరో వంద మంది విద్యార్థులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశాడు. 1500 మందికి భోజనాలు పెట్టాడు.

శునకరాజానికి జన్మదిన వేడుకలు
శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ వేడుకలు, అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగాయి. ఆలయం వద్ద పెద్ద స్టేజీ ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications