ఫుల్లుగా తాగి! టాక్సీ అద్దెగా ‘గోల్డ్ మెడల్’ ఇచ్చేశాడు
బీజింగ్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచానన్న ఆనందంతో ఆ ఆటగాడు తెగ చిందులేశాడు. అంతటితో ఆగకుండా, ఆ సంతోషం పట్టలేక బయటకెళ్లి అధిక మోతాదులో మద్యం సేవించాడు. అయితే జేబులో ఉన్న డబ్బంతా మందుకే అయిపోయింది.
ఇది గమనించకుండానే మళ్లీ తను బస చేసే హోటల్‌కు చేరుకునేందుకు ట్యాక్సీ ఎక్కాడు. టాక్సీ డ్రైవర్ డబ్బులు అడగడంతో అన్ని జేబులు వెతుక్కున్నాడు. ఏ జేబులో కూడా డబ్బులు లేకపోవడంతో.. ఏది గెలిచానని ఇంత సంబరం చేసుకున్నాడో దాన్నే(గోల్డ్ మెడల్‌ను) బిల్లు కింద ట్యాక్సీ డ్రైవర్‌కు ఇచ్చేశాడు ఆ అథ్లెట్.
ఈ ఘన కార్యానికి పాల్పడింది పోలెండ్‌కు చెందిన హమ్మర్ త్రోయర్ పావెల్ ఫెజ్డెక్. బీజింగ్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో హమ్మర్ త్రోయింగ్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఫెజ్డెక్.. తన విజయాన్ని ఆస్వాదించడానికి పోటీలు ముగియగానే సాయంత్రం బీజింగ్ వీధుల్లోకి వెళ్లాడు.

ఓ బారుకు వెళ్లి తన దగ్గరున్న డబ్బంతా అయిపోయే వరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత తిరిగెళ్లడానికి ట్యాక్సీకి డబ్బుల్లేక పతకాన్ని ఇచ్చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాగిన మైకంలో ఉండడం వల్ల మెడల్‌ను డ్రైవర్‌కు ఇచ్చేశానన్న విషయం గుర్తుకులేని పావెల్.. ఆ మరుసటి ఉదయం తన మెడల్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఎట్టకేలకు ఆ డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని మెడల్ సేకరించారు. అయితే ఆ డ్రైవర్ చెబితేగాని ట్యాక్సీ బిల్లు కింద మెడల్ ఇచ్చానన్న సంగతి గుర్తుకురాలేదు ఆ అథ్లెట్‌కు. ఆ డ్రైవర్ మాటలు విని పోలీసులు షాక్‌కు గురవ్వగా... పావెల్‌కు మాత్రం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications