దుస్తులు విప్పేసుకుంటూ లేడీ టీచర్ పాఠాలు

హైదరాబాద్: మానవ శరీరంలోని అవయవాల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించడానికి ఓ లేడీ టీచర్ తెగ కష్టపడిపోయింది. తన ఒంటి మీది దుస్తులను ఒక్కటొక్కటే విప్పేస్తూ మనిషి శరీరంలోని అవయవాల గురించి వివరిస్తూ వెళ్లింది.

చివరకు నగ్నంగా మారిపోయి పాఠాలు బోధించింది. ఈ సంఘటన నెదర్లాండ్‌లో జరిగింది. ఆమె పేరు డెబ్బీ హీర్కేన్. బయాలజీ టీచర్. హ్యూమన్ బాడీ గురించి, అవయవాలు, ఎనాటమీ గురించి లైవ్ షో లా పాఠం చెప్పి రికార్డులకెక్కింది. పాఠాలు చెప్పేముందు ఆమె బల్లమీదికి ఎక్కి ఒక్కొక్కటిగా తన దుస్తులను విప్పేసుకుంటూ వెళ్లింది.

 Dutch teacher strips before her class to teach the students a lesson

అయితే ఆమె శరీరంలోని ఒక్కో భాగం గురించి వివరిస్తూ, ఆ టైప్‌లో డిజైన్ చేసిన క్లాత్స్ కిందికి జారవిడుస్తూ వచ్చింది. శరీర భాగాలు ఎలా పని చేస్తాయి, అస్థిపంజరం ఎలా ఉంటుంది వంటి విషయాలు విప్పి చెప్పింది. వాళ్లకు బాగా అర్థం కావాలంటే ఇలా వైవిధ్యంగా పాఠాలు బోధించాలని చెప్పుకొచ్చింది.

అయితే, అన్ని సబ్జెక్టులకూ ఈ పద్ధతి మంచిది కాదని ఈ టీచరమ్మ సెలవిస్తోంది. అనాటమీ పాఠం చెబుతూ ఆ భామా మణి ఆ పనిచేసింది. అయితే, ఆమె బాడీ ష్యూట్ ధరించింది. దానివల్ల ఆమె శరీరంలోని ప్రతి అంగమూ బయటకు కనిపించింది. ఆమె ప్రయత్నాన్ని ఫేస్‌బుక్‌లో గ్రోయహెనే హార్ట్ స్కూల్ తెగ అభినందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+