రేవంత్‌ను భలే పట్టిచ్చావ్: స్టీఫెన్‌కు అలీ ముద్దులు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను ఏసీబీకి పట్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రధాన ఆకర్షణగా మారారు. పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకట్రావుతో ఆయన కలిసి కారులో అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.
రేవంత్ అరెస్టుకు కారణమైన అతనిని పలువురు మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ఆలింగనాలు, కరచాలనాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఏకంగా స్టీఫెన్ సన్ బుగ్గన ముద్దు పెట్టారు.
మీడియా వేచి ఉన్న వైపు విక్టరీ సింబల్ చూపించాలని ఎమ్మెల్సీ రాములు నాయకు కోరినా స్టీఫెన్ సన్ సున్నితంగా తిరస్కరించారు. చివరకు మహమూద్ అలీ విక్టరీ సింబల్ చూపించారు. మరోవైపు, ఏసీబీ అరెస్టు చేసిన రేవంత్ రెడ్డి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. స్టీఫెన్ సన్, రేవంత్‌లు సోమవారం అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణ.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ ఎదురుపడ్డారు. ఇది చాలా ఆసక్తికర పరిణామం. ఓటు హక్కు వినియోగించుకొని అసెంబ్లీ లాబీల నుంచి రేవంత్ బయటకు వచ్చాడు.
అదే సమయంలో తెరాస ఎమ్మెల్యేలతో కలిసి స్టీఫెన్ సన్ వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు ఎదురుపడ్డారు. ఒకరిని మరొకరు పట్టించుకోలేదు. అయితే, స్టీఫెన్ సన్ వెనకాల ఉన్న తెరాస ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి పరస్పరం చిరునవ్వుతో పలకరించుకోవడం గమనార్హం.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications