సీఎం కేసీఆర్ ఫోటోతో విశాఖ విద్యార్థికి హాల్ టిక్కెట్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఓ విద్యార్థికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటోతో హాల్ టిక్కెట్ వచ్చింది. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ సంస్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ పరీక్షలు గురువారం నుండి జరుగుతున్నాయి.
పరీక్షలు రాయబోయే విద్యార్థులకు హాల్ టిక్కెట్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి ఎం గిరీష్‌కు వచ్చిన హాల్ టిక్కెట్‌లో కేసీఆర్ ఫోటో ఉంది. దీంతో ఆ కళాశాల అధ్యాపక బృందం బిత్తరపోయింది.

వైజాగ్ కళాశాల నుండి విద్యార్థుల వివరాలు, ఫోటోను పంపడంలో ఎటువంటి పొరపాటు జరగలేదని స్థానిక కళాశాల వర్గాలు చెప్పాయి. హైదరాబాదులోని బోర్డు వద్దనే ఈ పొరపాటు జరిగి ఉంటుందని కళాశాల వర్గాలు చెప్పాయి.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications