హాలీవుడ్ పైత్యం: ‘శ్రీకృష్ణుడిపై అనుచిత డైలాగ్స్’
న్యూయార్క్/న్యూఢిల్లీ: వచ్చే ఏడాది విడుదల కానున్న ఓ హాలీవుడ్ చిత్రంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలున్నాయని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర మతాల సాంప్రదాయాలను గౌరవించే హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
‘చరిత్రనూ, హిందూ సంస్కృతినీ, దేవతలనూ కించపరుస్తూ సినిమాల్లో డైలాగులు రాయడం సాధారణం అయిపోయింది. దీన్ని ఏమాత్రం సహించం' అని అంతర్జాతీయ హిందూ సంఘాల ప్రతినిధులు రాజన్ హెచ్చరించారు.
వచ్చే ఏడాది విడుదల అవుతున్న చిత్రం ‘ఎక్స్-మెన్'. దీనికి ట్యాగ్‌లైన్ ‘ఎపొకలిప్సీ'. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. ఈ ట్రైలర్‌లో విలన్ పాత్ర పోషిస్తున్న ఎపొకలిప్స్ తనను గురించి చెప్పుకుంటూ ‘నన్ను చాలా పేర్లతో పిలుస్తారు. ఒకప్పుడు ‘రా' అనేవారు, తర్వాత ‘కృష్ణ' అన్నారు, ఇంకొందరు ‘ఎహ్వె' అన్నారు..' అంటూ ఓ డైలాగ్ చెప్తాడు.
‘అసలు హిందూ పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడి గురించి వీళ్లకు ఏం తెలుసు? ఏమీ చదవకుండా వీళ్లు ఇలాంటి పనికిమాలిన డైలాగులు రాస్తారా? ముందు ఈ హాలీవుడ్ వాళ్లంతా హిందూ చరిత్ర, సంస్కృతి పాఠాలను చదువుకోవాలి' అంటూ యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజమ్ ప్రతినిధి రాజన్ ఘాటుగా స్పందించారు.
ఈ డైలాగ్‌లలోని తప్పులను సరిదిద్దుకోవాలనీ, లేకపోతే తప్పులు చేసే వారిని పురాణాల్లో శ్రీకృష్ణుడు ఎలా శిక్షించాడో తాము వీళ్లకు ప్రత్యక్షంగా తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications